Sonia Gandhi: సోనియా గాంధీకి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది .
"ఆమెకు తేలికపాటి జ్వరం, కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించబడింది" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం మీడియా ప్రతినిధులకు తెలిపారు.
సోనియా గాంధీకి , ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసిన ఒక రోజు తర్వాత కోవిడ్‌కు పాజిటివ్ అని తేలింది.
జూన్ 8న సోనియా ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపించింది. ఈ కేసులో వారిద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకే సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com