కోవిడ్ భయం కొంచెం కూడా లేదు.. పెళ్లికి వెయ్యి మందిని పిలిచి..

కోవిడ్ భయం కొంచెం కూడా లేదు.. పెళ్లికి వెయ్యి మందిని పిలిచి..
కోవిడ్ కారణంగా సెలబ్రెటీలు సైతం సింపుల్‌గా పెళ్లి తంతు ముగిస్తుంటే వీళ్లు మాత్రం దాదాపు వెయ్యి మందికి పైగా అతిధులను పిలిచి ఆనందంగా విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు.

లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు.. ఎవరికి కోవిడ్ వుందో ఎవరికి లేదో తెలియట్లేదు. లక్షణాలు లేకపోయినా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది. కోవిడ్ వచ్చిన వ్యక్తి కోలుకుంటాడో లేదో అనుమానం. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి లక్షణాలుంటే కోలుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కూడా భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలు, ఫంక్షన్లు, విందు భోజనాలు చేస్తూ ఆనందడోలికల్లో మునుగుతున్నారే తప్ప ఆణుమాత్రమైనా జాగ్రత్తలు పాటించట్లేదు. వేడుకలు చేసుకోవడం ఆపట్లేదు. కర్ణాటక రాష్ట్రం మండ్య నగరంలో శుక్రవారం ఓ వివాహ వేడుక జరిగింది. కోవిడ్ కారణంగా సెలబ్రెటీలు సైతం సింపుల్‌గా పెళ్లి తంతు ముగిస్తుంటే వీళ్లు మాత్రం దాదాపు వెయ్యి మందికి పైగా అతిధులను పిలిచి ఆనందంగా విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు.

మాస్కులు లేవు, సామాజిక దూరం సంగతి సరేసరి. స్థానికుల సమాచారంతో ఆరోగ్య శాఖ అధికారులు, తహసీల్దార్ పోలీసులతో కలిసి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో మండపం రెంట్‌కి ఇచ్చినందుకు కళ్యాణమండపం యజమానికి రూ.12వేలు, వధువు, వరుడి కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున జరిమానా విధించి అందర్నీ కరోనా టెస్ట్‌కి పంపించారు. అందులో ఎంతమందికి కరోనా ఉందో రిపోర్ట్స్ వస్తే కానీ బయటపడదు.

Tags

Next Story