సెకండ్ వేవ్.. తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

సెకండ్ వేవ్.. తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు
24 గంటల వ్యవధిలో మృత్యుఒడికి చేరుకున్న వారి సంఖ్య 4,329గా నమోదైంది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న వార్త కాస్త ఆశాజనకంగా ఉన్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 24 గంటల వ్యవధిలో మృత్యుఒడికి చేరుకున్న వారి సంఖ్య 4,329గా నమోదైంది. దేశంలో ఇప్పటి వరకు 2.52 కోట్ల మందికి పాజిటివ్ రాగా.. 2,78,719 మంది కరోనా కాటుకు బలయ్యారు.

సోమవారం 18,69,223 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 2,63,533 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33,53,765 మంది కోవిడ్ తో బాధపడుతుండగా 2,15,96,512 మంది వైరస్ ను జయించారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 15,10,418 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 18.44 కోట్ల మందికి టీకా పంపిణీ జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story