అలర్ట్..ముంచుకొస్తున్న మూడో ముప్పు..ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో వేగంగా..

అలర్ట్..ముంచుకొస్తున్న మూడో ముప్పు..ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో వేగంగా..
Coronavirus Third Wave Alert: కరోనా థర్డ్‌వేవ్‌ సంకేతాలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఆగస్టులో కరోనా కేసులు విరుచుకుపడొచ్చని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

Coronavirus Third Wave Alert: కరోనా థర్డ్‌వేవ్‌ సంకేతాలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఆగస్టులో కరోనా కేసులు విరుచుకుపడొచ్చని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. దాన్ని నిజం చేస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది. కరోనా సోకిన వారి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించే తీరును ఆర్-ఫ్యాక్టర్‌ చెబుతుంది. ప్రస్తుతం ఈ ఆర్‌-ఫ్యాక్టర్‌ ఒకటికి చేరువవుతోంది. ఆర్-ఫ్యాక్టర్‌ 1గా ఉందంటే.. కరోనా వచ్చిన ప్రతి వంద మంది ద్వారా మరో వంద మందికి వైరస్ సోకుతుంది. ఉదాహరణకు ఆర్-ఫ్యాక్టర్ 0.95గా ఉంటే.. ప్రతి వంద మంది ద్వారా మరో 95 మందికి ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలో ఈ ఆర్-ఫ్యాక్టర్‌ 1.11గా ఉంది.

ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. త్రిపుర, మణిపూర్ మినహా.. మిగిలిన అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్‌-ఫ్యాక్టర్ ఒకటిని దాటేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో ఆర్-ఫ్యాక్టర్ ఒకటికి చేరువవుతోంది. ఇక ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి మరో రెండు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. తగ్గుతున్నట్టుగా కనిపించిన కరోనా కేసులు.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నిన్న కూడా దేశవ్యాప్తంగా 43వేల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలు దాటింది. ఈ యాక్టివ్‌ కేసులలో 37 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపింది.

మెట్రో నగరాల్లో ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది. పుణె, ఢిల్లీల్లోనూ ప్రమాదకర పరిస్థితులు రాబోతున్నట్టు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పుడు.. మార్చి, ఏప్రిల్‌ మధ్య ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.37గా నమోదైంది. జూన్‌ వచ్చే సరికి 0.78కి తగ్గింది. అంటే సెకండ్‌వేవ్‌ ఉధృతి కాస్త తగ్గిందని అర్ధం. కాని, జులై వచ్చే సరికి ఈ ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరగడం మొదలైంది. మొన్న 22వ తేదీ నాటికి ఇది ఏకంగా 0.95కి పెగింది. కేరళ, సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాలో ఆర్‌-ఫ్యాక్టర్ ఒకటి దాటడంతో మరోసారి పరిస్థితులు చేయిదాటొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్-ఫ్యాక్టర్ ఒకటి దాటిందంటే కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైనట్టేనని చెబుతున్నారు.

Tags

Next Story