AICC presidential election : ప్రారంభమైన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్..

AICC presidential election : ప్రారంభమైన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్..
AICC presidential election : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభమైంది. అక్టోబర్ 17న పోలింగ్ జరిగింది. అధ్యక్ష పదవికి కోసం సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు.

AICC presidential election : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభమైంది. అక్టోబర్ 17న పోలింగ్ జరిగింది. అధ్యక్ష పదవికి కోసం సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. 9,900 మంది పార్టీ ప్రతినిధులకు గాను 9,477 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.



దాదాపు 96 శాతం పోలింగ్‌ జరిగింది. ఏఐసీసీ కార్యాలయంలో పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు భద్రపర్చారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్‌ టేబుల్‌ దగ్గరకు బ్యాలెట్ బాక్సులను తీసుకువస్తున్నారు.. మొదటఏజెంట్ల సమక్షంలో ఓట్ల క్లబ్బింగ్‌ చేస్తారు.. ఆ తరువాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో 4,740 ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.


ఇక సగాని కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించనున్నారు. 4,740 ఓట్లు ఏ అభ్యర్ధికైతే వస్తాయో, ఆ తర్వాత వెనువెంటనే ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ సమయంలో ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియనుంది.

Tags

Next Story