కొవాగ్జిన్ విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోదు : భారత్ బయోటెక్ ఎండీ

కొవాగ్జిన్ విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోదు : భారత్ బయోటెక్ ఎండీ

భారత బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోదని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన స్పష్టంచేశారు. కొవాగ్జిన్ టీకా విషయంలో రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు తాము 16 వ్యాక్సిన్లు తయారుచేశామని.. 123 దేశాలకు సేవలందిస్తున్నామని కృష్ణ ఎల్ల వెల్లడించారు.


Tags

Next Story