Covid - 19 : నాసల్ వ్యాక్సిన్ రిలీజ్

Covid - 19 : నాసల్ వ్యాక్సిన్ రిలీజ్
నాసల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ.325లకు, ప్రైవేట్ టీకా కేంద్రాలకు రూ.800 చొప్పున విక్రయించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.


నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ ను కేంద్రం ప్రారంభించింది. భారత్ బయోటెక్ తయారు చేసిన 'ఇన్కోవాక్' ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయా, సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నాసల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ.325లకు, ప్రైవేట్ టీకా కేంద్రాలకు రూ.800 చొప్పున విక్రయించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.

ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ ను గ్లోబల్ ఛేంజర్ గా పేర్కొన్నారు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ట ఎల్లా. ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీ, డెలివరీ సిస్టమ్స్ లో గ్లోబల్ చేంజర్ అయిన 'ఇన్కోవాక్' ను రిలీజ్ చేసినందుకు మేము గర్విస్తున్నామని తెలిపారు. నాసల్ వ్యాక్సిన్, వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాస్వామ్యంతో అభివృద్ధి చేశామని చెప్పారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కోవిడ్ సురక్ష ప్రోగ్రామ్ ద్వారా ఉత్పత్తి అభివృద్ధి, క్రినికల్ ట్రయల్స్ కు కొంతవరకు భారత ప్రభుత్వం నిధులను సమకూర్చింది.

Tags

Next Story