Covid 19 : కోవిడ్ 19పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

Covid 19 : కోవిడ్ 19పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో 1,134 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 7,026 కు పెరుగగా... ఐదు మరణాలు సంభవించాయి. కోవిడ్ వలన మరణాల సంఖ్య ప్రస్తుతానికి 5,30,813కి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర,కేరళలో ఒక్కో మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోజువారీ సానుకూలత 1.09 శాతంగా నమోదు కాగా, వారంవారీ సానుకూలత 0.98 శాతంగా నిర్ణయించబడింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం 1,134 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో, రోజువారీ పాజిటివిటీ 1.09 శాతంగా ఉండగా, వారపు పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. మంగళవారం, ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం, ఢిల్లీలో 83 కోవిడ్ -19 కేసులు 5.83 శాతం పాజిటివిటీ రేటుతో పాటు ఒకరు మృతి చెందారు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.

Tags

Next Story