Covid - 19 : గడిచిన 24 గంటల్లో 2151 కోవిడ్ కేసులు

Covid - 19 : గడిచిన 24 గంటల్లో 2151 కోవిడ్ కేసులు
మహారాష్ట్ర, కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఒక్కరు కోవిడ్ తో ప్రాణాలు విడిచారు

గడిచిన 24గంటల్లో భారత్ లో 2151 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. 152రోజుల్లో అధికంగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2,151 కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒకే రోజులో రెండు వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. రోజువారీ సానుకూలత రేటు 1.51 శాతంగా ఉంది. ప్రస్తుతం.. కోవిడ్-19 మరణాల సంఖ్య ఏడుకు చేరడంతో.. మరణాలు 5,30,848కి పెరిగాయి. మహారాష్ట్ర, కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఒక్కరు కోవిడ్ తో ప్రాణాలు విడిచారు.


ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన డేటా ప్రకారం, రోజువారీ పాజిటివ్ రేట్ 1.51 శాతంగా నమోదుకాగా, వారాంతర పాజిటివ్ రేట్ 1.53 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లుగా నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం... క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో 0.03 శాతం ఉన్నాయి, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.78 శాతంకాగా... కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story