కోవిడ్ ఎఫెక్ట్.. బడ్జెట్ లోనే ఫ్లాటు

కోవిడ్ ఎఫెక్ట్.. బడ్జెట్ లోనే ఫ్లాటు
నగరవాసులు కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు.. ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ ప్రభావంతో కొనుగోలు దారులకు

నగరవాసులు కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు.. ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ ప్రభావంతో కొనుగోలు దారులకు అందుబాటు ధరలో ఇళ్లు, ఫ్లాట్లు అమ్మకానికి ఉంటున్నాయి. తమ బడ్జెట్ లో దొరికే స్థిరాస్థుల కోసం కొనుగోలు దారులు ఎంక్వైరీ చేస్తున్నారు. 40 శాతం మంది వెంచర్లను సందర్శిస్తున్నారని రియల్టర్లు అంటున్నారు. కొనేవారి సంఖ్య 15 శాతం పెరిగిందని స్థిరాస్థి సంస్థలు అంటున్నాయి. మధ్యతరగతి వాసుల కోసం రూ.50 లక్షల లోపు ఇళ్లు అందుబాటులో ఉంటే.. ఎగువ మధ్యతరగతి వారి కోసం రూ.70 లక్షల నుంచి కోటి వరకు ఇళ్లు, ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు రూ.70 లక్షు పలుకుతుంటే.. మరి కొన్ని చోట్ల త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ రూ.50లక్షలకే వస్తోంది. శివారు ప్రాంతాల్లో ఈ ధరకు విల్లాలు వస్తున్నాయి. నగరంలోని ప్రాంతాన్ని బట్టి చ.అ. రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి రూ.12 వేల వరకు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story