కేంద్రం శుభవార్త.. దేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్

కేంద్రం శుభవార్త.. దేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్
ఇప్పటి వరకు కరోనా గుప్పిట్లో భయం భయంగా బతుకీడ్చిన దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది..

ఇప్పటి వరకు కరోనా గుప్పిట్లో భయం భయంగా బతుకీడ్చిన దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.. ఇప్పటికే రెండుసార్లు డ్రైరన్‌ విజయవంతంగా పూర్తికాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ముందుగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కోటి మంది వున్నారని అంచనా వేసిన కేంద్రం.. తొలిదశలో వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనుంది.. ఆ తర్వాత పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. మొత్తం మూడు కోట్ల మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ ఈనెల 16 నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో దేశవ్యాప్తంగా మరో 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ అయినట్లుగా తెలుస్తోంది.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై ఇవాళ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 11న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.. ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఎలా వేయాలన్నదానిపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు గోడౌన్లలో వ్యాక్సిన్లను భద్రపరిచారు. 83 కోట్ల సిరంజిలను కేంద్రం సమకూర్చింది.

Tags

Next Story