Cow Hug Day: జోకులు వద్దు... విశిష్ఠత తెలుసుకోవాలి ముందు...

ఈ సారి ప్రేమికుల దినోత్సవాన్ని గోవులను హత్తుకునే దినోత్సవంగా మార్చాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు 'కౌ గహ్ డే" అన్న కార్యక్రమాన్ని పశుసంరక్షణ శాఖ ప్రకటించింది. అయితే, సదుద్దేశంతో ప్రవేశపెట్టిన దీనిపై మీమ్స్, జోకులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. గోవులను హత్తుకోవడంలోని ప్రాముఖ్యత తెలియని వారు చేస్తున్న దుష్ప్రచారంతో అత్యంత విశిష్ఠత కలిగిన ఈ సంప్రదాయం మరుగున పడే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే ఈ 'కౌ హగ్ డే' విదేశాల్లోనూ ప్రాచుర్యం సంపాదించుకుంది.
నెదర్ ల్యాండ్స్ "కో క్నుఫ్లెన్"(గోవును హత్తుకోవడం) అనే సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. మనిషికి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు అంతర్గతంగా హీలింగ్ అవ్వాల్సిన సందర్భాల్లో గంగిగోవులను హత్తుకోవడం ద్వారా మనసులోని బరువు మటుమాయం అవుతందన్నది వారి విశ్వాసం. 2020లో ఇదో గ్లోబల్ ట్రెండ్ గానూ మారింది. విపరీతమైన ఒత్తిడికి లోనైనవారు గోవుల మధ్య మూడు గంటలు గడిపుతూ తమ బాధలను మరచిపోవడం ఆనవాయితీగా మారింది.
అమెరికాలోనూ ఇదే తరహాలో ఓ ప్రత్యేకమైన ఫెసిలిటీని కూడా ప్రారంభించారు. పశువులకు, మనుషులకు మధ్య ప్రేమైక ఆలింగనం వల్ల ప్రేమ, ఆప్యాయత, సంతోషానికి సంబంధించిన హార్మోన్స్ విడుదలయ్యి ఇరువురి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతందని పలు అధ్యాయనాలు సైతం చెబుతున్నాయి. గోవుల గుండె నిదానంగా కొట్టుకుంటుంది. వాటి శరీరం వెచ్చగా ఉంటుంది. ఆ భారీకాాయాన్ని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటే మనుషులకు స్ట్రెస్ తగ్గి, ఒక్కసారిగా ఒత్తిడి తగ్గి పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. ఈ ప్రక్రియలో సెరటోనిన్, ఎండార్ఫిన్స్ వంటి న్యూరో ట్రాన్స్ మిట్టర్స్ విడుదలవుతాయని బెనిఫిట్స్ ఆఫ్ యానిమల్ అసిస్టెడ్ థెరపీ ఇన్ మెంటల్ హెల్త్ అనే పరిశోధనాత్మక ఆర్టికల్ లో ప్రచురితం అయింది. అంతేకాదు డిప్రెషన్ తో పాటూ, ఆటిజం, డిమెంట్షియా, షెజోప్రెనియా వంటి సమస్యలతో బాధపడేవారకి యానిమల్ అసిస్టెడ్ థెరపీ ప్రత్యామ్నాయంగా మారింది. మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక భారత్ విషయానికి వస్తే హిందూ సంప్రదాయంలో దేశవ్యాప్తంగా గంగిగోవులను పూజించడం, వాటిని ఇంట్లో సభ్యులుగా, తమ పిల్లలుగా అనుకుని సాకడం పరిపాటి. ఇక గోవులను హత్తుకోవడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పెరిగేవారికి అతి సాధారణ ప్రక్రియ అనడంలో సందేహమే లేదు. సిటీల్లోనూ, మెట్లో నగరాల్లోనూ పుట్టిపెరిగిన వారికి తప్పితే పశువులతో సహజీవనం అనేది మన దేశంలో పురాణకాలం నుంచి వస్తోన్న ఆచారం. కామధేనువు, గోమాతగా పూజలు అందుకుంటూ, ప్రేమను పంచడంలో మన గంగిగోవు పెట్టింది పేరు. అలాంటి గోమాతను మనస్ఫుర్తిగా హత్తుకోవాంటే అదృష్టం ఉండాలి. నిజానికి అది కూడా సరిపోదు. ఆ తల్లిని హత్తుకోవాలంటే... ముందుగా ఆమె ఇచ్ఛపూర్వక ఆమోదం తప్పని సరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com