Crime: దంత వైద్యురాలి ఆత్మహత్య

Crime: దంత వైద్యురాలి ఆత్మహత్య
ప్రేమ పేరిట సహ వైద్యుని వేధింపులు: తనువు చాలించిన యువ వైద్యురాలు..

ప్రేమ పేరిట సహ ఉద్యోగే వేధింపులకు పాల్పడటంతో ఓ దంత వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. లక్నోకి చెందిన డెంటిస్ట్ బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న మరో వైద్యుడు సుమిత్, ఆమెను ప్రేమ పేరిట వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెను మద్యం సేవించాల్సిందిగా, సిగరెట్ తాగాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటూ డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడని తెలుస్తోంది. అయితే వైద్యురాలు వీటన్నింటికి నిరాకరించడంతో ఆమె గురించి ఆసుపత్రిలో తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దీంతో విరక్తి చెందిన వైద్యురాలి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జనవరి 25న చోటుచేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story