Crime: పోకిరి ఆట కట్టించిన బాలిక

Crime: పోకిరి ఆట కట్టించిన బాలిక
X
బాలికతో క్యాబ్‌డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ముంబైలో పోకిరి ఆట కట్టించింది ఓ బాలిక. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 6న బాధిత బాలిక వ్రోలీ ప్రాంతంలోని హజీఅలీ దాటి నడుచుకుంటూ వెళుతుండగా కారు డ్రైవర్‌ ఆమెను పిలిచి ఎక్కడికి వెళ్లాలని వాకబు చేశాడు. కారు వద్దకు ఆ బాలిక వచ్చే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బాలిక పోకిరి చేస్తున్న వికృత చేష్టలను వీడియో తీస్తు కేకలు వేసింది. దీంతో అక్కడి నుంచి పరార్‌ అయిన నిందితుడు అంధేరిలోని ఆఫీస్‌ వద్ద కారును పార్క్‌ చేసి వెళ్లి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా కారు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకున్నారు. అంధేరిలోని ఆఫీసు దగ్గర కారు ఉందని తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. అతని ఫోన్‌ స్విచ్‌ఆఫ్ అని రావడంతో అక్కడే రెక్కీ నిర్వహించి మరుసటి రోజు ఉదయమే నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు అబ్దుల్‌ అహ్మద్‌ గౌస్ రహిని(23)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Tags

Next Story