Crime: బైక్‌పై వచ్చి బాలికను ఎత్తుకెళ్లి..

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వీధిలో నిలుచున్న బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు ఢిల్లీలోని దేవాలన్ మందిర్ ప్రాంతంలో బుధవారం తల్లీ కూతురు ఇద్దరు రోడ్డుపై నిలుచున్నారు. ఈ క్రమంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు అగంతకులు బాలికను అపహరించుకెళ్లారు. అనంతరం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌరీస్‌నగర్‌లో బాలికను విడిచి వెళ్లారు. బుధవారం సాయంత్రం 5.16 గంటలకు ఒకసారి 5.21గంటలకు మరోసారి కంట్రోల్ రూంకు కాల్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నుంచి కాల్ రావడంతో బాలిక మౌరీస్‌నగర్‌లో ఉందని నిర్ధారించుకున్నారు. ఈ సంఘటన పట్ల సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ శ్వేతా చౌహాన్ ఐపీసీ సెక్షన్ 363 కింద డీబీజీ రోడ్డు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆమె వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com