Crime: న్యాయస్థానంలోనే భార్యపై యాసిడ్ దాడి..ఎందుకంటే..

ప్రియుడితో వెళ్లిపోయిందని ఆగ్రహంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 2016లో జరిగిన దొంగతనం కేసులో నిందితురాలు శివకుమార్ అనే వ్యక్తి భార్యాభర్తలు. శివకుమార్ లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో గత వారం ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.
గురువారం కేసు విచారణ నిమిత్తం నిందితురాలు జిల్లా కోర్టుకు వచ్చింది. కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త పథకం ప్రకారం వాటర్ బాటిల్‌లో యాసిడ్ తెచ్చుకున్నాడు. ఆమె కనిపించగానే ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమె మెడ కింది భాగం తీవ్రంగా కాలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించాగా అప్పటికే ఎనభై శాతం గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. దాడి చేసిన శివ కుమార్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన కోర్టు ప్రాంగణంలో జరగడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com