Crime: భూతగాదాల్లో కాల్పులు.. అసువులుబాసిన చిన్నారి

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో అన్యంపుణ్యం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన భోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి బిలాయి గ్రమానికి చెందిన కృష్ణసింగ్ నివాసంలోకి నలుగుదు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. కృష్ణసింగ్‌ను దూషిస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె ఆరాధ్య ప్రణాలు కోల్పోయింది. 25ఎకరాల భూమి విషయంలో మరో వ్యక్తితో తనకు తగాద ఉందని ఈ విషయం మూలంగానే నాలుగేళ్ల క్రితం తన సోదరున్ని కూడా పొట్టన బెట్టుకున్నారని కృష్ణసింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com