Crime: 57 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ రేట్.. ఆందోళన కలిగిస్తున్న వార్షిక నివేదిక
hyderabad

Crime: 57శాతం పెరిగిన సైబర్ క్రైమ్ రేట్; ఆందోళన కలిగిస్తున్న వార్షిక నివేదిక
ఈ ఏడాది నగరంలో చోటుచేసుకున్న నేరాలపై వార్షిక నివేదిక విడుదలవ్వగా, విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి ఈ నివేదిక విడుదల చేయగా 2022లో తెలంగాణాలో నేరాల శాతం 4.44% పెరిగిందని స్పష్టమైంది.
2021లో 1,36,895 కేసులు నమోదు అవ్వగా 2022లో కేసుల సంఖ్య 1,42,917 చేరుకుంది. ఇక సైబర్ క్రైమ్ విషయంలో లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2021లో 8839 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవ్వగా, 2022లో 13,895 కేసులు నమోదు అయ్యాయి. అంటే...గతఏడాదితో పోల్చుకుంటే సైబర్ క్రైమ్ ఏకంగా 57శాతం పెరిగిందని అర్థమవుతోంది.
ఇక వైట్ కాలర్ క్రైమ్ లు 35శాతం పెరగగా, మహిళపట్ల జరుగుతున్న నేరాలు 3.8శాతం పెరిగాయి. ఇక అపరహరణల కేసులు 15శాతం పెరిగాయి. మరోవైపు లాభం కోసం జరిగే హత్యలు గణనీయంగా తగ్గినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. దోపిడీ కేసులు 35శాతం తగ్గిపోగా అత్యాచారాల రేటు 17శాతం తగ్గిందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com