Crime : రెండు రాష్ట్రాల పోలీసులు సీరియస్... యూట్యూబర్ అరెస్ట్

Crime : రెండు రాష్ట్రాల పోలీసులు సీరియస్...  యూట్యూబర్ అరెస్ట్
X
తమిళనాడులో పనిచేస్తున్న బీహార్ కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తప్పుడు వీడియోను ప్రచారం చేశాడు

తప్పుడు కథనాలను ప్రచారం చేసిన బీహార్ యూట్యూబర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూట్యూబర్ మనీష్ కశ్యప్ పై బీహార్ పోలీసులు, తమిళనాడు పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. శనివారం కశ్యప్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులో పనిచేస్తున్న బీహార్ కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తప్పుడు వీడియోను ప్రచారం చేశాడు మనీష్ కశ్యప్. ఈ విషయంపై తమిళనాడులో కశ్యప్ తో పాటు అతనికి టీం మెంబర్ యువరాజ్ సింగ్ రాజ్ పూత్ లపై మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మార్చి 15న మనీష్ కశ్యప్, యువరాజ్ సింగ్ రాజ్ పూత్ లపై అరెస్ట్ వారెంట్లను జారీచేశారు.

బీహార్, తమిళనాడు పోలీసులతో పాటు ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్ ను పట్టుకోవడానికి ఆరు టీంలను రంగంలోకి దింపింది. శనివారం బెట్టియాలోని జగదీష్ పూర్ పోలీస్ట్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఆర్థిక అవకతవకలకు కశ్యప్ పాల్పడ్డాడని EOU తెలిపింది. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు అధికారులు తెలిపారు. కశ్యప్ వీడియోలకు ప్రభావితమైన ఉత్తరాది కార్మికులు భయాందోళనలు చెంది తమిళనాడు నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.


Tags

Next Story