అంబరాన్నంటిన సంబరాలు.. ఊహాన్‌లో కొత్త సంవత్సర వేడుకలు

అంబరాన్నంటిన సంబరాలు.. ఊహాన్‌లో కొత్త సంవత్సర వేడుకలు
అర్థరాత్రి 12 దాటగానే అరుపులు కేకలతో అందరూ హ్యాపీ న్యూయర్ చెప్పుకున్నారు.

గత ఏడాది కరోనా వైరస్‌తో యుద్ధం చేసింది. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతోంది చైనాలోని వూహాన్. లాక్‌డౌన్‌లో ఆంక్షల నడుమ కాలం గడిపిన వూహాన్ ప్రజలు .. సంతోష సమయాలను సంబరాలు చేసుకునేందుకు వెనకాడడం లేదు.

డిసెంబర్ 31 అర్థరాత్రి నగరంలో భారీ సంఖ్యలో జనం రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. 2021కు స్వాగతం చెబుతూ సందడి చేశారు. సాంప్రదాయం ప్రకారం హన్‌కూవ్ కస్టమ్స్ హౌజ్ బిల్డింగ్ వద్ద వందల సంఖ్యలో జనం గుమిగూడారు. అర్థరాత్రి 12 దాటగానే అరుపులు కేకలతో అందరూ హ్యాపీ న్యూయర్ చెప్పుకున్నారు.

భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చిన జనాలను పోలీసులు నియంత్రించారు. కోవిడ్ వ్యాప్తికి కారణమైన వూహాన్ నగరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రతినిధులు ఈ నెలలో సందర్శించనున్నారు. కరోనా మహమ్మారి ఇక్కడే పుట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత అనే దానిపై స్టడీ చేయనున్నారు.

అయితే వ్యాప్తి నిరోధానికి తొలి నాళ్లలోనే పగడ్భంధీ చర్యలు అవలంభించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది వూహాన్. ఇటీవలే అక్కడ భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story