Crypto Currency: క్రిప్టో కరెన్సీపై RBI గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

Crypto Currency: క్రిప్టో కరెన్సీపై RBI గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
క్రిప్టో కరెన్సీ జూదం లాంటిది; భారత్ లోకి అనుమతి లేనే లేదు....



క్రిప్టో కరెన్సీపై RBIగవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ జూదం లాంటిదని అన్నారు. ఇలాంటి జూదాన్ని భారత్ లో అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం బిజినెస్ టుడే బ్యాంకింగ్, ఎకానమీ సమ్మిట్ లో మాట్లాడిన దాస్... క్రిప్టో కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని 'సెంట్రల్ బ్యాంక్ గవర్నర్' అభిప్రాయపడినప్పటికీ, క్రిప్టో కరెన్సీకి విలువ లేదని శక్తికాంత్ దాస్ తెలిపారు.

కొంతమంది వ్యక్తులు క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని... క్రిప్టోకు మాత్రం అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. భారత్ లో క్రిప్టో కరెన్సీ అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. ఒకరకంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

Next Story