నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా
కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ప్రకటన వంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం

పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండాగా నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ప్రకటన వంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అంతర్గత ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే లేఖ కూడా రాశారు.

దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ సహా.. పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీని నిర్ణయించనుంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది.


Tags

Next Story