Cyber Crime: ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ .. రూ.లక్ష స్వాహా...

Cyber Crime: ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ .. రూ.లక్ష స్వాహా...
కర్ణాకటలో సైబర్ నేరగాళ్ల చేతి వాటం; పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పి రూ.లక్షకి టోకరా...

ఆన్ లైన్ లో ఫాస్ట్ టాగ్ రీఛార్జ్ చేసుకోబోయి సైబర్ నేరగాళ్లకు అడ్డంగా దొరికిపోయాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఫ్రాన్సిస్ పియస్ అనే వ్యక్తి, మంగళూరుకు వెళుతుండగా హెజామెడే టోల్ ప్లాజా దగ్గర ఆగాడు. అయితే ఫాస్ట్ ట్యాగ్ కార్డ్ బ్యాలెన్స్ అయిపోవడంతో వెంటనే రీచార్జ్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో హెల్ప్ లైన్ నంబర్ కోసం వెతికాడు. అలా సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఫ్రాన్సిస్ సదరు వ్యక్తి చెప్పినట్లుగానే తన మొబైల్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను షేర్ చేశాడు. ఆ వెంటనే అతడి అకౌంట్ నుంచి విడతల వారీగా రూ. లక్ష డెబిట్ అయ్యాయి. అప్పటికి గానీ, తాను మోసపోయానని గుర్తంచిన ఫ్రాన్సిస్ ఉడిపిలోని CEN పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సదరు సైబర్ నేరగాడు తనను ఓ అనుమానస్పద ముబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేయాల్సిందిగా కోరాడని, అది చేసిన తరువాతే తన బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు పోయాయని తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 66(C), 66(D) IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ తమ పబ్బం గడుపుకునేందుకు ఎన్ని దారులు వెతుకుతున్నారో ఈ ఘటన బట్టీ అర్ధమవుతోంది. తస్మాత్ జాగ్రత్త.

Tags

Read MoreRead Less
Next Story