Dalai Lama Controversy: చిన్నారి పెదవులపై ముద్దు; ఆపై... సభ్యసమాజం నివ్వెరపోయేలా....

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఓ చిన్నారి పట్ల ప్రదర్శించిన అనుచిత ప్రవర్తన కారణంగా వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ఓ కార్యక్రమంలో తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ మైనర్ బాలుడిని తన పెదవులపై ముద్దు పెట్టుకోవాల్సిందిగా సూచించిన దలైలామా, అనంతరం బాలుడితో తన నాలుకను తన నోట్లోకి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో లామా వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా లామా ప్రవర్తన ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దలైలామా అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. లామాకు మతి భ్రమించిందా అని కొందరు ట్వీట్ చేస్తుంటే మరి కొందరు అతిడిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి తన అనుచిత ప్రవర్తనపై లామా ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com