MadhyaPradesh: ఒక్కరిని రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో..

MadhyaPradesh: ఒక్కరిని రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో..
ప్రమాదవశాత్తు 16 ఏళ్ల బాలుడు బావిలో పడిపోయాడు. దీంతో అతడిని రక్షించేందుకు ఊరంతా కదిలింది

MadhyaPradesh: "Madhya Pradesh Vidisha well wall collapse, Shivraj Singh Chouhan, Well wall collapseప్రమాదవశాత్తు 16 ఏళ్ల బాలుడు బావిలో పడిపోయాడు. దీంతో అతడిని రక్షించేందుకు ఊరంతా కదిలింది. దాదాపు 40 మంది బావి చుట్టూ చేరి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూటీమ్ బావిలోకి దిగింది. వెలికి తీసిన వారిలో నలుగురు మరణించగా, ఇప్పటి వరకు 20 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. బావి 40 అడుగుల లోతులో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రెస్క్యూటీమ్ భావిస్తోంది.

ఈ సంఘటన మధ్యప్రదేశ్ భోపాల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్ పట్టార్ ప్రాంతంలో జరిగింది. బావి నుంచి నీళ్ళు తోడేందుకు ప్రయత్నిస్తున్న సందీప్ పరిహార్ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. అతడిని రక్షించడానికి జనం బావి వద్దకు పరుగెత్తడంతో బావి అంచులు లోపలికి పడిపోయాయి. దాంతో అక్కడ నిలబడ్డ 40 మంది బావిలో పడిపోయారని సర్పంచ్ అమర్ సింగ్ కుష్వా పోలీసులకు తెలిపారు.

బాలుడు పడిపోయాడని ఊరంతా వ్యాప్తి చెందడంతో, ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రదేశానికి తరలివచ్చారు. బావి చుట్టూ దాదాపు 50 మంది ఉన్నారని అంచనా. బావి చుట్టూ ఉన్న కాంక్రీట్ స్లాబ్ వారి బరువును తీసుకోలేకపోయింది. ఈ సంఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలో జరగడంతో ఏం జరుగుతుందో వారికి అర్ధం కాలేదు.

ఆ సమయంలో బావి అంచు కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వెంటనే రెస్క్యూటీమ్‌ని ద్వారా బావిలో పడిపోయిన వారిలో చాలా మందిని రక్షించి పైకి తీసుకువచ్చారు.స్థానికులు బాధితులను స్వయంగా రక్షించడానికి ప్రయత్నించారు. కాని చీకటి, బావి యొక్క లోతు వారికి ఆటంకం కలిగించింది.

అదే సమయంలో ఒక ఇన్స్పెక్టర్ మరియు హోమ్ గార్డ్ కూడా బావిలో పడిపోయారు. వారిని రెస్క్యూ టీమ్ రక్షించింది. బావిలో పడిపోయిన వ్యక్తుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియదని డిజిపి వివేక్ జోహ్రీ అన్నారు. ఈ దుదృష్టకర సంఘటన పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

మృతుల బంధువుల కోసం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ .50 వేల నష్టపరిహారాన్ని సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్య చికిత్స కూడా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story