Corona Cases : 18 రాష్ట్రాల్లో తగ్గుతున్న కరోనా కేసులు.. !

Corona Cases : 18 రాష్ట్రాల్లో తగ్గుతున్న కరోనా కేసులు.. !
ఇటీవల వరకు రెండోదశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ చత్తీస్ గడ్ తో పాటు మరో 14 రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ నెమ్మదించిందని తెలిపింది.

కరోనా కేసులు, మరణాల తగ్గుదల ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల వరకు రెండోదశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ చత్తీస్ గడ్ తో పాటు మరో 14 రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ నెమ్మదించిందని తెలిపింది. అయితే దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుదల కొనసాగుతోందని వివరించింది. వీటితో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్ సహా పదహారు రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది.

13 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు లక్ష పైగా ఉన్నాయని చెప్పింది. 26 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు 17కి పైగా ఉందని తెలిపింది. కరోనా ప్రారంభం నుంచి దేశంలో రోజువారి అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర.. మధ్యలో అతి కొద్ది రోజులు కేరళలో ఎక్కువగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ప్రారంభమైన సెకండ్ వెవ్ లో మాత్రం మొదటి నుంచి మహారాష్ట్రలోనే గరిష్ఠ సంఖ్యలో కేసులు వచ్చాయి. తాజాగా కర్ణాటక పాజిటివ్ లతో పాటు మరణాల్లో కూడా దాన్ని అధిగమించింది.

దేశ రాజధాని ఢిల్లీలో మూడు వారాలుగా లాక్ డౌన్ అమలతో కరోనా వ్యాప్తికి తగ్గినట్లు తెలిసింది. ఇక మహారాష్ట్రలో లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15 తో లాక్ డౌన్ మూగియల్సి ఉన్నప్పటికీ సగానికిపైగా జిల్లాలో పరిస్థితి తీవ్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వం పొడగింపు ఆలోచింప చేస్తోంది. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో శుక్రవారం నుంచి ఏడు రోజులు లాక్ డౌన్ మొదలు కానుంది.



Tags

Read MoreRead Less
Next Story