Delhi : గజగజమంటోన్న రాజధాని... ఎముకలు కొరికే చలిలో న్యూఇయర్ వేడుకలు
Delhi

Delhi : ఈ ఏడాదికి ఢిల్లీ వాసులు దట్టమైన మంచు నడుమ, ఎముకలు కొరికే చలిలోనే బిక్కుబిక్కుమంటూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈరోజు దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే టెంపరేచర్ లు అత్యంత తక్కువ స్థాయి అంటే 10డిగ్రీలకు పడిపోవడంతో జనాలు చలికి బిక్కచిక్కిపోతున్నారు. తాజాగా కోల్డ్ వేవ్ కూడా రాబోతుండటంతో న్యూఇయర్ వేడుకలపై సందిగ్ధం నెలకొంది.
ఇప్పటికే ఢిల్లీ నగరాన్ని భారీ మంచు దుప్పటి కప్పేసింది. రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 2 కల్లా వాతావరణ ఉష్ణోగ్రతలు మరో నాలుగు డిగ్రీల కనిష్ఠానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తరువాత నాలుగు రోజులు నగరం మొత్తం పొగమంచు, తీవ్రమైన చలిగాలులు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com