Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు

Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు
సిసోడియా కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించిన సీబీఐ

దేశంలో సీబీఐ సోదాల పర్వం కొనసాగుతుంది. నేడు(శనివారం) ఢిల్లీ డిప్యూటీ సీఈఎం మనీష్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు జరిగాయి. అతని నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు సీబీఐ అధికారులు. గతంలోను పలుమార్లు సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.


సీబీఐ సోదాలపై సిసోడియా ట్విట్టర్‌లో స్పందించారు. ఈ రోజు మరోసారి తన కార్యాలయంలో సీబీఐ తనిఖీలు చేసిందని తెలిపారు. వారికి తాను స్వాగతం పలుకుతున్నాట్లు చెప్పారు. సీబీఐ తన ఇంట్లో, లాకర్‌లో అలాగే, తమ ఊర్లో కి వెళ్లి కూడా తనిఖీలు చేసిందని, అయినా ఏమీ దొరక లేదని తెలిపారు.


ఎందుకంటే తాను ఏ తప్పు చేయలేదని ఆయన ట్విట్టర్ రాసుకొచ్చారు. నిజాయితీగా ఢిల్లీ చిన్నారుల విద్య కోసం పని చేస్తున్నాను కాబట్టి తనని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఆగష్టు లో కూడా సిసోడియా కు మనీ లాండరింగ్‌ కేసులో సంబంధం ఉందని అతని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాకర్‌లో తనిఖీలు జరిగాయి. అప్పుడు కూడా ఏమీ దొరక్కపోవడం విశేషం.


Tags

Read MoreRead Less
Next Story