Delhi: ఢిల్లీలో మేయర్ ఎన్నిక మూడోసారి వాయిదా

ఢిల్లీలో మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఇవాళ మూడోసారి ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. అయితే ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన కు దిగింది. దీంతో మేయర్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీపై ఆప్ ఆధిపత్యం సాధించింది.
నామినేట్ అయిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ వ్యతిరేకిస్తున్నది. దీంతో మేయర్ ఎన్నిక సమయంలో ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. గత రెండు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ కూడా అదే తరహా సీన్ రిపీటైంది. డీఎంసీ చట్టాన్ని సక్సేనా అతిక్రమించారని ఆప్ ఆరోపిస్తున్నది.
మరోవైపు ఢిఎంసీలో 250 వార్డులు ఉండగా..134 సీట్లలలో ఆప్ గెలవగా.. 104 సీట్లను బీజేపీ సొంతం చేసుకున్నది. ఢిల్లీలోని బీజేపీకి చెందిన ఏడు లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు,14 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com