Delhi: బైక్ ట్యాక్సీలపై నిషేధం

X
By - Subba Reddy |21 Feb 2023 11:15 AM IST
నిబంధనలు అతిక్రమిస్తే 10 వేల జరిమానా
ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్‌లను ట్యాక్సీలుగా ఉపయోగించడం నిషేధమని స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీలు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి 5 వేలు, రెండోసారి 10వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. తీవ్రతను బట్టి ఏడాదిపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని వెల్లడించింది. బైక్ ట్యాక్సీ నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com