Delhi : ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్

Delhi : ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్
మొత్తం 266 ఓట్లు పోల్ కాగా.. అందులో షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠం ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటు న్నారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా.. అందులో షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. 10 మంది నామినే టెడ్‌ ఎంపీలు, 14 మంది నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు, మొత్తం 250 కౌన్సిలర్లలో 241 మంది ఓటు వేశారు. ఇక కాంగ్రెస్‌ నుండి గెలుపొందిన 9 మంది కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Tags

Next Story