Delhi: వీడియో తీయబోయి పట్టాల కింద పడిన యువకులు

Delhi: వీడియో తీయబోయి పట్టాల కింద పడిన యువకులు
ఢిల్లీలో రైల్వే పట్టాల కింద పడ్డ యవకులు; వీడియో కోసం ప్రాణాల మీదికి తెచ్చుకున్న వైనం..

సరదాగా వీడియో తీయబోయి పట్టు తప్పి రైలు కింద పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీలోని కాంతి నగర్ ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. మృతులను బీటెక్ 3వ ఏడాది చదువుతున్న వంశ్ శర్మ(23), సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న మోను(20)గా గుర్తించారు. ఫిబ్రవరి 23న 4గం.35ని ప్రాంతంలో ఈ ఘటన చేటుచేసుకున్నట్లు తెలుస్తోంది. యువకులు ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్ద వీడియో తీసేందుకు ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story