Delhi : కేజ్రీవాల్ క్యాబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సౌరభ్ భరద్వాజ్ కు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీరు, పరిశ్రమల శాఖల బాధ్యతలను అప్పగించగా, అతిషికి విద్య, PWD, విద్యుత్, పర్యాటక శాఖల బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీ మంత్రిగా సౌరభ్ భరద్వాజ్ ప్రమాణస్వీకారం చేయడం ఇది రెండో సారి. 2013 ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. మనిష్ సిసోడియా ఆధ్వర్యంలో అతిషి విద్యాశాఖ సలహాదారుగా పని చేశారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్నారు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్. వీరి రాజీనామా చేసిన తర్వాత వీరి స్థానంలో సౌరభ్, అతిషిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు కేజ్రీవాల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com