Delhi : బంగ్లా ఖాళీ చేయాలంటూ సిసోడియాకు నోటీసులు

Delhi : బంగ్లా ఖాళీ చేయాలంటూ సిసోడియాకు నోటీసులు
సిసోడియా తన పదవికి రాజీనామా చేసినందు వలన ఆయన నివసిస్తున్న బంగ్లాను అతిషికి కెటాయించారు

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివసిస్తోన్న బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు లేఖ రాశారు. సిసోడియా తన పదవికి రాజీనామా చేసినందు వలన ఆయన నివసిస్తున్న బంగ్లాను అతిషికి కెటాయించారు. అతిషి ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతోంది. మార్చి 21, అంతకు ముందు బంగ్లాను ఖాళీ చేయాలని, సంబంధిత నిబంధనల ప్రకారం 15రోజులలోగా బిల్డింగ్ ను ఖాళీ చేయడానికి అనుమతులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. సత్యేందర్, సిసోడియాల రాజీనామాలతో వరుసగా రెండు క్యాబినెట్ బెర్త్ లు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో అతిషి, సౌరభ్ భరద్వాజ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2021-22కి సంబంధించి రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో అవినీతికి పాల్పడ్డారనే అరోపణలపై ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story