Dilhi: 16 నెలల బాలుడు.. అవయవదానంతో ఎందరికో ప్రాణంపోశాడు..

Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌కు గురైన 16 నెలల బాలుడి కుటుంబం ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అతని అవయవాలను దానం చేసింది. అడుగులు తడబడుతూ బుడి బుడి నడకలతో ఇల్లంతా కలియతిరుగుతున్న రిషాంత్‌ని చూసి అమ్మానాన్న ఎంతో సంతోషించారు.
నా కొడుకు నడిచేస్తున్నాడు అని నలుగురికీ చెప్పి ఆనందించారు ఆ దంపతులు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. విధి చిన్న చూపు చూసింది ఆ చిన్నారిని. 16 నెలల రిషాంత్ అడుగులు వేయడం ప్రారంభించాడు. ఆగస్టు 17 ఉదయం, రిషాన్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ఉపిందర్ వృత్తిరీత్యా ప్రైవేట్ కాంట్రాక్టర్. కొడుకు పడిపోయిన విషయం తెలిసి వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చాడు. హుటాహుటిన బాలుడిని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
రిషాంత్‌ని చూసిన వైద్యులు బాబు తలకు బలమైన గాయం అయిందని మెరుగైన చికిత్స కోసం AIIMS జై ప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆగస్టు 24న బ్రెయిన్ స్టెమ్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ORBO, AIIMS ఢిల్లీకి చెందిన వైద్యులు, మార్పిడి కోఆర్డినేటర్లు పిల్లల కుటుంబాన్ని సంప్రదించి అవయవ దానం గురించి తెలియజేశారు.
రిషాంట్ చిన్న పిల్లవాడు. అతడి అవయవాలు ఇతరులకు ప్రాణం పోస్తాయని తెలుసుకున్న కుటుంబ సభ్యులు దానం చేయడానికి మనస్పూర్తిగా అంగీకరించారు. బేబీ రిషాంత్ మా ఆరో బిడ్డ. అతడిని మా కంటికి రెప్పలా కాపాడుకున్నాము. కానీ దేవుడు ఇలా చేశాడు అని ఉపేందర్, భార్య కన్నీరు మున్నీరయ్యారు. ఐదుగురు అక్కలను అమితంగా ప్రేమించాడు. అతని అవయవాలు ఇతరుల ప్రాణాలను కాపాడగలిగితే అంతకంటే కావలసింది ఏముంది. అందుకే వైద్యుల నిర్ణయానికి మేము ఓకే చెప్పాము అని ఉపేందర్ అన్నారు.
రిషాంత్ జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి
అవయవదానం ద్వారా రిషాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని రిషాంత్ మామ తెలిపారు. "మేము అవసరమైన వారికి ఆహారం, బట్టలు మరియు డబ్బును దానం చేస్తాము. కానీ రిషాంత్ తన అవయవాలు దానం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. రిషాంత్ ఎక్కడో ఒక చోట సజీవంగానే ఉంటాడు. ఈ రోజు మామధ్య లేడు అంతే అని కళ్లు తుడుచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com