Delhi: ఫైస్టార్ హోటల్‌కు రూ.23 లక్షలు టోకరా..!

తానో సీనియర్ UAE అధికారినంటూ కలరింగ్ ఇచ్చాడు. నాలుగు నెలలు బిల్లు కట్టకుండా ఓ ఫైస్టార్ హోటల్‌లో రాజ భోగాలు అనుభవించాడు. చివరికి రూ. 23 లక్షలు పంగ నామం పెట్టి పత్తా లేకుండా పారిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఫై స్టార్ హోటల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి గత ఏడాది ఆగష్టు 1వ తేదీన న్యూ ఢిల్లీ లోని లీలా ప్యాలెస్‌లో 427 గదిలో దిగాడు. అరబ్ రాయల్ ఫ్యామిలో తానో ఉన్నత ఉద్యోగినని సిబ్బందిని నమ్మించాడు. ఫేక్ బిజినెస్‌కార్డును అలాగే UAE రెసిడెంట్ కార్డ్‌ను కూడా ఇచ్చాడు. ఆగష్టు 2022, సెప్టెంబర్ 22, 2022 గది రెంటు కోసం రూ.11.5 లక్షలు కూడా చెల్లించాడని మొత్తం బకాయి ఇప్పటికీ రూ. 23,48,413 కాగా దాని కోసం అతడు 20 లక్షల విలువైన పోస్ట్‌డేటెడ్ చెక్కును అందించగా అది బౌన్స్ అయినట్లు సిబ్బంది పేర్కొన్నది.
అనంతరం నాలుగు నెలలు గడిపిన తరువాత నవంబర్,20 మధ్యాహ్నం 1గం.లకు హోటల్‌లోని విలువైన వస్తువులతో ఉడాయించాడు. ఇది గ్రహించిన హోటల్ సిబ్బంది అతని పై కేసు నమోదు చేశారు. పథకం ప్రకారం ఈ పని చేశాడని తమను నమ్మించడం కోసమే మెదట 11.5 లక్షలు చెల్లించి అనంతరం పోస్ట్ డేట్ చెక్‌ను ఇచ్చి జారుకున్నాడని హోటల్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ లోపల, పరిసరాలలో సీసీ కెమెరాల ద్వారా షరీఫ్ కదలికలని గమనిస్తున్నట్లు, అలాగే అతనిని గుర్తించడం కోసం వివిధ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. షరీఫ్ వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com