Delhi : బీజేపీ, ఆప్ ల మధ్య పోస్టర్ల వార్

Delhi : బీజేపీ, ఆప్ ల మధ్య పోస్టర్ల వార్

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లను అంటించారు ఆప్ నాయకులు. అందుకు నిరసనగా కేజ్రీవాల్ గద్దెదిగాలంటే బీజేపీ నాయకులు కూడా పోస్టర్లను అంటించారు. "మోదీ హటావో దేశ్ బచావో అంటూ ఆప్ నాయకులు ఢిల్లీగోడలపై పోస్టర్లను అంటించారు. సదరు పోస్టర్లను పోలీసులు తొలగించి ఆప్ నాయకులను ప్రింటింగ్ ప్రెస్ యజమానులను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అవినీతి నియంత అంటూ పోస్టర్లను అంటించారు బీజేపీ నేత మంజీదర్ సింగ్ సిర్సా. కేజ్రీవాల్ ను తొలగించండి ఢిల్లీని రక్షించండి అనే నినాదంతో కూడా పోస్టర్లు అతికించబడ్డాయి.

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత పోస్టర్ల వార్ జరిగింది. ప్రజా ఆస్తులను ద్వంసం చేసినందుకు పోస్టర్లను అతికించిన వారిపై, తయారు చేసిన ప్రింటింగ్ ప్రెస్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోస్లర్లు అతికిస్తేనే ప్రదాని మోదీకి భయంపట్టుకుందని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇలాంటి భయపడే ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story