Delhi : ఘనంగా ప్రారంభమైన ధర్మ సంసద్ కార్యక్రమాలు

Delhi : ఘనంగా ప్రారంభమైన ధర్మ సంసద్ కార్యక్రమాలు
చతర్‌పూర్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో ఈనెల 10వ తేదీ వరకు దేశం కోసం మహాయజ్ఞం సహా వివిధ కార్యక్రమాలు తలపెట్టారు

దేశ రాజధాని ఢిల్లీలో ధర్మ సంసద్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చతర్‌పూర్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో ఈనెల 10వ తేదీ వరకు దేశం కోసం మహాయజ్ఞం సహా వివిధ కార్యక్రమాలు తలపెట్టారు. శ్రీరామ కర్మభూమి న్యాస్ సిద్ధాశ్రమం బుక్సర్, నమో సద్భావన సమితి, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో సనాతన్ సంస్కృతి సమాగమం నిర్వహిస్తున్నారు. భారతదేశం, ప్రపంచ శాంతి కోసం ధర్మ సంసద్ ఆధ్వర్యంలో మహాయజ్ఞం చేపట్టారు. దక్షిణ, ఉత్తర భారతదేశానికి చెందిన మహా పండితుల ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తున్నారు.

మహాత్మా సనాతన సంస్కృతి సమాగమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సాధువులు హాజరయ్యారు. ఇందులో భాగంగా మొదటి రోజు మతాల సభ నిర్వహించారు. రేపటి నుండి 4 రోజుల పాటు ఐదు అంశాల ఆధారంగా హవన్ కుండ్‌లో యాగం, పూజలు నిర్వహిస్తారు. ప్రారంభం కార్యక్రమానికి ముందు శోభాయాత్ర నిర్వహించారు 11 వందల మంది మహిళలు. హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించారు. ప్రకృతి, సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం కోసం లోక్ మంథన్, శ్రీ అన్నపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు.

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు రెండేళ్లుగా విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు నమో సద్భావన సమితి ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ వెల్లడించారు. కరోనా సమయంలో భారతదేశం ముందుకు వెళ్లి ప్రపంచం మొత్తానికి సహాయం చేసిందని.. ఈసారి ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలతో పాటు భారతదేశం ప్రపంచ గురువుగా అవతరించాలని మహాయజ్ఞం చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story