Delhi Accident: మృతురాలి వ్యక్తిత్వాన్ని నింధించటం సరికాదు: ఢిల్లీ మహిళా కమిషన్ ఛీఫ్ స్వాతి

ఢిల్లీ మహిళా చీఫ్ కమిషన్ స్వాతి మలివాల్ బుధవారం కంజావాలా ఘటనపై మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు అంజలి సింగ్‌తో పాటు ఉన్న స్నేహితురాలి వాదనలు విన్న తరువాత బాధితురాలి వ్యక్తిత్వం పట్ల నైతిక విలువలను ప్రశ్నించడం మానేయాలని ప్రజలను కోరారు.
ఢిల్లీ శివారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజలి సింగ్‌ను కారు దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన స్నేహితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు మంగళవారం తీసుకున్నారు. అంజలి శనివారం రాత్రి మద్యం సేవించి ఉందని, స్నేహితులను కలుసుకోవడానికి హోటల్‌కు వెళ్లే సమయంలో తానే స్కూటి నడుపుతానని పట్టుపట్టిందని చెప్పింది.
ప్రమాదం జరగగానే సింగ్ స్నేహితురాలు కనీసం పోలీసులకు గాని వారి కుటుంబ సభ్యులకు గాని చెప్పలేదని ఏమీ పట్టనట్టుగా ఇంటికి వెళ్లిపోయిందని స్వాతి వాపోయారు. సీసీటీవీ ఫుటేజీలో చూసి తనను ప్రశ్నించేంతవరకు ఎవరికి ఆమె ఏమీ చెప్పలేదని, ఆ సమయంలో తాను కారుని వెంబడించి ఉన్నా లేదా కాపాడమని ఎవరికైనా చెప్పినా అంజలి సింగ్ బతికి ఉండేదన్నారు.
అంజలి చాలా బాధాకరమైన మరణం పొందిందని వ్యాఖ్యానించిన స్వాతి మృతురాలి వ్యక్తిత్వాన్ని దూషించి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఇంకా బాధించరాదని, నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని, ఇప్పటికే ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com