ఐదేళ్ల కనిష్ఠానికి ఢిల్లీలోని వాయుకాలుష్యం

కరోనా మహమ్మారి కారణంగా దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. గత కొన్న ఏళ్లుగా ఢిల్లీలో వాయుకాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఒకానొక దశలో ఢిల్లీ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశ రెండో రాజధాని ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో కాలుష్యం భారీగా తగ్గింది. సోమవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 41 నమోదైందని కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. సుమారు గడిచిన ఐదేళ్లలో ఇదే కనిష్టం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కల ప్రకారం.. గాలిలో కాలుష్యం 0-50 మధ్య ఉంటే 'గుడ్', 51-100 మధ్య 'సాధారణం', 101-200 మధ్య మోస్తరు, 201-300 మధ్య 'పూర్', 301-400 'వెరీ పూర్', 401-500 మధ్య 'తీవ్రం' ఉన్నట్లు.. ఇక 500కి మించి నమోదైతే 'ఎమర్జెన్సీ' కేటగిరీలో ఉన్నట్లు. ఈ యేడాదిలో ఢిల్లీలో గుడ్ గా నమోదవ్వడం ఇది ఐదోసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com