రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిని చేయాలని ఢిల్లీ కాంగ్రెస్‌ తీర్మానం

రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిని చేయాలని ఢిల్లీ కాంగ్రెస్‌ తీర్మానం
జీఎస్‌టీ మొదలు వ్యవసాయ చట్టాల వరకు రాహుల్‌ చెప్పిన జోస్యాలన్నీ నిజమయ్యాయన్నారు అనిల్‌ చౌదురి.

రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న డిమాండ్లు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలంతా సమావేశమై ఇదే తీర్మానం చేశారు.. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా.. అప్పట్నుంచి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియా నిర్వర్తిస్తూ వస్తున్నారు.. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ శాశ్వత అధ్యక్ష పదవిపై చర్చ జరిగింది.. జూన్‌ తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుందనే ప్రచారం జరిగింది.

తాజాగా రాహుల్‌కు మద్దతుగా ఢిల్లీ కాంగ్రెస్‌ తీర్మానం చేయడంతో పార్టీలో మళ్లీ ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలకు స్ఫూర్తి రగిలించడం రాహుల్‌కు మాత్రమే సాధ్యమని ఢిల్లీ పీసీసీ చీఫ్‌ అనిల్‌ చౌదురి చెప్పారు. జీఎస్‌టీ మొదలు వ్యవసాయ చట్టాల వరకు ఆయన చెప్పిన జోస్యాలన్నీ నిజమయ్యాయన్నారు. ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని.. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ని ఎన్నుకోవాలని తీర్మానం చేసినట్లుగా అనిల్‌ చౌదురి చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story