ఇవాళ రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్

ఇవాళ రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధించనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో కరోనా ఉధృతి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుందని వెల్లడించారు. కరోనా చైన్ తెగ్గొటేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

లాక్ డౌన్ సందర్భంగా మాల్స్, జిమ్స్, ఆడిటోరియాలు మొదలైనవి పూర్తి స్థాయిలో మూసివేయనునట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే సినిమా థియేటర్లు మాత్రం 30శాతం సామర్థ్యంతో నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలన్ని వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేయాలని.. ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యధాతథంగా పనిచేస్తాయన్నారు. అలాగే వీకెండ్ మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు.

ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఓ వైపు ఐసీయూలో బెడ్స్‌ ఫుల్‌ అయ్యాయి. మరోవైపు ఆక్సీజన్‌ కొరతతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. రెమ్‌డిసివర్‌ కొరత ప్రభావం కూడా రోగులపై పడుతోంది.

Tags

Next Story