Delhi Crime: మత్తుమందు ఇచ్చి కారులోనే టెకీపై లైంగిక దాడి...

Delhi Crime: మత్తుమందు ఇచ్చి కారులోనే టెకీపై లైంగిక దాడి...
గురుగ్రామ్ లో టెకీ పై లైంగిక దాడి; ఇంటర్వ్యూకి పిలిచి, మత్తు మందు ఇచ్చి, షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియాలో....

ఇంటర్వ్యూ కోసం పిలిచి, మత్తు మందు ఇచ్చి షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి ఓ 27 ఏళ్ల బీటెక్ గ్రాడ్యుయేట్ పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువతికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తుషార్ శర్మ అనే వ్యక్తి కాల్ చేశాడు. గురుగ్రామ్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు నమ్మబలికాడు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న యువతిని కారులో ఎక్కించుకోగానే ఆమెకు మత్తు పదార్ధంతో కూడిన నీళ్లును ఇచ్చాడు. అది సేవించిన యువతి కాసేపటికే మత్తులోకి జారుకుంది. అనంతరం కారును గురుగ్రామ్ మాల్ లోని పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్లాడు. ఆమెను కారు వెనుక సీటులోకి తోసి ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించి, తనని అక్కడే వదిలి వెళ్లిపోయాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు స్పష్టం చేసింది. ఈ మేరకు సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తుషార్ శర్మ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యప్తు ప్రారంభించారు. మరోవైపు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story