Delhi government : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Delhi government : ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలోనే వాహనాల విషయంలో కీలక ప్రకటన చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా.. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పూర్తయిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది. ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఎన్‌ఓసీ జారీ చేస్తామని తెలిపింది. 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ పూర్తయిన డీజిల్ వాహనాలకు ఎటువంటి ఎన్‌ఓసీ జారీ చేయబోమని చెప్పింది.
ఇక పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లుదాటిన పెట్రోల్ వాహనాలను స్థానికంగా వినియోగించుకోవాలనుకుంటే.. వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ పేర్కొంది. అధీకృత ఏజెన్సీల ద్వారా ఎంప్యానెల్డ్ ఎలక్ట్రిక్ కిట్‌లను వాటిని అమర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అండర్ ప్రాసెస్‌లో ఉన్నట్లు వెల్లడించింది. లేని పక్షంలో.. అలాంటి వాహనాలను రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు బృందాలు స్వాధీనం చేసుకుని, తక్కుకు పంపుతాయని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com