జాతీయం

Dr Nabila Sadiq: కరోనాతో జామియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ మృతి

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన 38 ఏళ్ల ప్రొఫెసర్ జామియా నబీలా సాదిక్ సోమవారం రాత్రి కోవిడ్ తో మరణించారు.

Dr Nabila Sadiq: కరోనాతో జామియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ మృతి
X

Dr Nabila Sadiq: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన 38 ఏళ్ల ప్రొఫెసర్ జామియా నబీలా సాదిక్ సోమవారం రాత్రి కోవిడ్ తో మరణించారు. ఆమె ఫరీదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మే 4 వ తేదీన ఆమె ట్విట్టర్‌లో ఆస్పత్రిలో బెడ్ కావాలని అభ్యర్థించారు. ఆమె తనకోసం ఐసియులో బెడ్ కావాలని కోరింది. చివరికి తన ప్రయత్నం ఫలించి ఆమెకు బెడ్ దొరికినట్లు ట్విట్టర్ లో తెలిపారు.

సాదిక్ తన చివరి రోజుల్లో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనలను ట్విట్టర్‌లో రికార్డ్ చేశారు. ఆమె చివరి కొన్ని ట్వీట్లలో, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారని, తన పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని, తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థించాలని ఆమె తన విద్యార్థులను కోరారు.

ఆమె తన తల్లి 10 రోజుల ముందు మరణించింది

నబీలా సాదిక్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) నుండి పిహెచ్‌డి చేశారు. జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఏప్రిల్ 20 వరకు విద్యార్థులకు వారి థీసిస్‌ లో సహాయం చేశారని ఆమె స్నేహితులు వెల్లడించారు.

నబీలా సాదిక్ మరణానికి పది రోజుల ముందు , ఆమె 76 ఏళ్ల తల్లి, నుజాత్ కోవిడ్ కారణంగా కన్నుమూశారు. ఆమె తండ్రి కూడా వైరస్ బారిన పడి చివరికి కోలుకుని చివరకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు.

తల్లి మరణం గురించి నబీలా సాదిక్ కి తెలియదు

తన తల్లి చనిపోయిందని నబీలాకు తెలియదని సాదిక్ స్నేహితులు వెల్లడించారు.

Next Story

RELATED STORIES