Delhi Liquor Case : ఆడిటర్ బుచ్చిబాబుపై ఈడీ నజర్

X
By - Vijayanand |22 Feb 2023 4:38 PM IST
విజ్ఞప్తిని అనుమతించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ రేపటి నుంచి 2 రోజుల పాటు తీహార్ జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించారు
ఆడిటర్ బుచ్చిబాబుపై ఈడీ మరోసారి నజర్ పెట్టింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన్ను విచారించనున్నారు ఈడీ అధికారులు. సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో తీహార్ జైల్లో ఉన్న బుచ్చిబాబును 2 రోజుల పాటు ప్రశ్నించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కోరింది ఈడీ. వారి విజ్ఞప్తిని అనుమతించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ రేపటి నుంచి 2 రోజుల పాటు తీహార్ జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బుచ్చిబాబు నుంచి సేకరించేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని తయారు చేసినట్లు సమాచారం. గతంలోనూ తమ కార్యాలయానికి పిలిపించి..ప్రశ్నించారు ఈడీ అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com