Delhi Liquor Scam: దర్యాప్తుకు హాజరుకావలని ఢిల్లీ డిప్యూటి సీఎంకు నోటీసులు

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఇవాళ హాజరు కావాలని ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా పేరు లేక పోయినా ఈ స్కాంకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేసేందుకే విచారణకు కావాలని నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ నుంచి మరోసారి పిలుపొచ్చిందని సిసోడియా ట్వీట్ చేశారు. కేంద్రం సీబీఐ, ఈడీలను తనపై ఉసిగొల్పుతుందని, గతంలో ఆ సంస్థలు తన ఇల్లు, బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేసినా తనకు వ్యతిరేకంగా వారికి ఏమీ దొరకలేదని సిసోడియా తెలిపారు. ఢిల్లీ లో అభివృద్ధి కార్యక్రమాలు చేయనీకుండా అడ్డుకునేందుకే సీబీఐను తన వెనుక పడేలా చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే ఇవాళ్టి తన విచారణ వాయిదా వేయాలని సీబీఐ అధికారులను కోరారు. ఫిబ్రవరి నెలాఖరులోగా విచారణకు హాజరవుతానని చెప్పారు. తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని అన్నారు. ఢిల్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న తాను ఇప్పుడు బడ్జెట్ ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యమని.. అందుకే విచారణ తేదీని మార్చాలంటూ సీబీఐ అధికారులను కోరారు. కాగా ఇవాళ విచారణకు హాజరుకావాలని నిన్న సీబీఐ అధికారులు సిసోడియాకు నోటీసులు అందజేశారు. అందుకు తాను ఇవాళ విచారణకు వస్తానని సిసోడియా కూడా చెప్పారు. అయితే సడెన్‌గా సిసోడియా విచారణ తేదీని మార్చమని అధికారులను అడగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com