Delhi Liquor Scam : కేజ్రీవాల్ సన్నిహితుడికి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్ పేరును పలుమార్లు ప్రస్తావించింది. నిందితులకు, కేజ్రీవాల్‌కు మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కాంలో భాగస్వాములైన వారితో కేజ్రీవాల్ ఫేస్ టైమ్‌లో మాట్లాడినట్లు ఛార్జిషీటులో ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుండి వచ్చిన వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీకే అందాయని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపింది.
ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ తీవ్రంగా మండి పడ్డారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ ఈడీని ప్రయోగిస్తోందని విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సంస్థలను చెప్పుచేతల్లో ఉంచుకుని విపక్షనేతలను టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com