Delhi Liquor Scam: సిసోడియా అరెస్ట్‌కు రంగం సిద్ధం

Delhi Liquor Scam: సిసోడియా అరెస్ట్‌కు రంగం సిద్ధం
ఢిల్లీలో భారీగా పోలీసుల మొహరింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎంమనీష్ సిసోడియా అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.ఢిల్లీలో భారీగా పోలీసుల మొహరించారు.కాసేపట్లో సీబీఐ విచారణకు సిసోడియా హాజరయ్యే అవకాశం ఉంది.ఇక ఈ కేసులో స్పీడ్‌ పెంచింది సీబీఐ. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.ఈ దర్యాప్తులో మనీష్ సిసోడియాకు రెండోసారి విచారించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది.ఇవాళ విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. మొదట ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున తాను సీబీఐ విచారణకు రాలేనని మనీష్ సిసోడియా సీబీఐకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ ఇవాళ విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు.


గతేడాది అక్టోబర్ లో కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు సీబీఐ విచారించింది.ఆయన నివాసంలో,కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. మరోవైపు సిసోడియా ఢిల్లీ విద్యార్థులకు మెరుగయిన విద్య అందించేందుకు కృషి చేసున్నారని,ఆయనకు పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక సిసోడియా అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story