Delhi Liquor Scam: నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?

Delhi Liquor Scam: నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?
ముందునుంచీ ఊహిస్తున్నట్లుగానే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది

ముందునుంచీ ఊహిస్తున్నట్లుగానే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. లిక్కర్‌ పాలసీ అమలులో అవకతవకలపై సీబీఐ అధికారులు ఆయన్ను విచారించి.. తరువాత అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించేలా మద్యం విధానం రూపొందించి, వారి ద్వారా ముందస్తుగా ముడుపులు అందుకున్నారన్న కారణంగా గతేడాది ఆగస్టు 17న 14 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అయితే ఈకేసులో నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు అన్న ఉత్కంఠ నెలకొంది.

ఈ కేసులో తెరపైకి వచ్చిన కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ఆ దిశగా దర్యాప్తు సంస్ధలు అడుగులు వేస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం మెడకు లిక్కర్‌ స్కాం ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆయన పీఏను ప్రశ్నించిన సీబీఐ కేజ్రీవాల్‌ ఇళ్లు, క్యాంప్‌ ఆఫీస్‌ నుండే లిక్కర్‌ స్కాం వ్యవవహారాలు నడిచాయని అభియోగపత్రాల్లో తెలిపింది.

ఇప్పటివరకు ఈ కేసులో విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, దినేష్‌ అరోరా, గోరంట్ల బుచ్చిబాబులు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే సిసోడియా పీఏ దినేష్‌ అరోడా అప్రూవర్‌గా మారాడు. వీరితో సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కీలక వ్యక్తుల పేర్లను ఛార్జిషీట్‌లలో ప్రస్తావించాయి దర్యాప్తు సంస్ధలు. సౌత్‌ గ్రూప్‌లో శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట రాఘవతో పాటు ఎమ్మెల్సీ కవిత,మాగుంట శ్రీనివాస్‌ రెడ్డిలు భాగస్వామ్యులని తెలిపింది. ఇప్పటికే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట రాఘవను అరెస్ట్ చేసింది సీబీఐ. దీంతో ఈ కేసులో నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story